అన్నదాత దుఃఖీభవ! | - | Sakshi
Sakshi News home page

అన్నదాత దుఃఖీభవ!

Aug 29 2025 2:35 AM | Updated on Aug 29 2025 2:35 AM

అన్నద

అన్నదాత దుఃఖీభవ!

అనంతపురం అగ్రికల్చర్‌: అన్నదాత సుఖీభవ పథకం కాస్త రైతుల పాలిట దుఃఖీభవగా మారింది. కేంద్ర ప్రభుత్వం అందజేసే పీఎం కిసాన్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. రైతులను మభ్యపెట్టి మొదటి ఏడాది సుఖీభవ కింద చెల్లించాల్సిన రూ.400 కోట్లకు పైగా పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ఏడాది పథకాన్ని అమలు చేసింది. అందులో అర్హులైన కొందరు రైతులకు కొర్రీలు వేసింది. ఈ నెల 2న 2.75 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు ప్రకారం రూ.53.3 కోట్లు, సుఖీభవ కింద రూ.5 వేల ప్రకారం రూ.137.82 కోట్లు చొప్పున మొత్తం రూ.191.45 కోట్లు విడుదల చేశారు. అయితే జాబితాలు అస్తవ్యస్తంగా ఉండటం, ఎన్‌పీసీఐ, ఈకేవైసీ లేదంటూ విడుదల చేసి 25 రోజులవుతున్నా నేటికీ వేలాది మంది రైతులకు సొమ్ము జమ కాలేదు. దీంతో రైతులు ఆర్‌ఎస్‌కేలు, వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, జేడీఏ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

సాంకేతిక కారణాలు చూపుతూ..

ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్‌ అంటూ 5,800, ఎన్‌పీసీఐ నాట్‌ మ్యాపింగ్‌ అంటూ 1,500 మందితో పాటు వివిధ కారణాలతో మరో 13 వేల మందికి ... మొత్తంగా 20 వేల మంది సుఖీభవ సొమ్ము అందక నానాపాట్లు పడుతున్నారు. గ్రామాలు, మండలాల్లో స్పష్టత లేక జేడీఏ కార్యాలయానికి ప్రతి రోజూ పదుల సంఖ్యలో రైతులు వచ్చి ఆరాతీస్తున్నారు. ప్రధానంగా సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన అకౌంట్లకు రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయకపోవడంతో సొమ్ము జమ కావడం లేదని చెబుతున్నారు. కొందరికి సుఖీభవ సొమ్ము, మరికొందరికి పీఎం కిసాన్‌ సొమ్ము జమ కావడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. ఈకేవైసీ, ఎన్‌పీసీఐ చేయించామని రైతులు చెబుతున్నా.. ప్రాసెస్‌లో ఉంది, జమ అవుతుందని అధికారులు నచ్చజెబుతున్నారు. అక్టోబర్‌లో రెండో విడత కింద పీఎం కిసాన్‌ రూ.2 వేలు, సుఖీభవ కింద రూ.5 వేలు జమ కానుంది.

వైఎస్‌ జగన్‌ హయాంలో ఠంచన్‌గా ‘భరోసా’

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2019–24 మధ్య కాలంలో ఏటా జూన్‌, అక్టోబర్‌, జనవరిలో రైతు భరోసా, పీఎం కిసాన్‌ సొమ్ము రైతులకు జమ చేస్తూ వచ్చారు. అప్పట్లో ఏటా ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున 2.92 లక్షల మందికి భరోసా అందించారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో జిల్లా రైతులకు రూ.1,937 కోట్ల మేర పెట్టుబడి సాయం అందింది. అప్పటి జాబితాతో పోల్చుకుంటే రైతుల సంఖ్య కొంత పెరగాల్సి ఉండగా, దాదాపు 20 వేల మంది రైతులకు కొర్రీలు వేయడం విశేషం. గత జాబితాల ఆధారంగా జమ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదంటున్నారు. ఇలా మొదటి ఏడాది రూ.400 కోట్లు ఎగనామం పెట్టడంతో పాటు కొర్రీలు వేసి 20 వేల మందికి అన్యాయం చేయడం, సాంకేతిక కారణాలు చెప్పి మరికొందరిని ఇబ్బందులకు గురి చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు.

సుఖీభవ పథకం లబ్ధి కోసం అఽధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు

సొమ్ము కోసం ఇంకా 20 వేల మంది రైతులు వెయిటింగ్‌

గతంలో క్రమం తప్పకుండా ‘భరోసా’ అందించిన వైఎస్‌ జగన్‌

అన్నదాత దుఃఖీభవ! 1
1/1

అన్నదాత దుఃఖీభవ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement