
భరించలేని దుర్వాసన
‘అగ్నివీర్’కు 159 మంది అర్హత
తిరుపతి రూరల్: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షలో తిరుపతిలోని ఎస్వీ డిఫెన్స్ అకాడమీకి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ మేరకు ఆ అకాడమీ చైర్మన్ బి.శేషారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన అభినందించారు. వీరికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాప్తాడు రూరల్: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ ఐజీ నగర్ (మబ్బుకొట్టాలు)కు చెందిన వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు ఐజీనగర్‌కు చెందిన ఈడిగ పాండు (42) కూలి పనులతో జీవనం సాగించేవాడు. భార్య అరుణాదేవి, ఓ కుమార్తె ఉన్నారు. ఈ నెల 21న ఉదయం 9.30 గంటలకు టిఫిన్ తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో వెళ్తుండగా ఆవులు అడ్డురావడంతో అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసరాల్లోకి వెళ్లగానే భరించలేని దుర్వాసనతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ప్రతి శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున గొర్రెలు, పొట్టేళ్లు, పశువులు, ఎద్దుల సంత జరుగుతుంది. వర్షపు నీటి నిల్వకు తోడు పెంట ఉండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారం, పండ్ల వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. గత మూడు వారాలుగా ఇదే పరిస్థితి. మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నా... మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– అనంతపురం అగ్రికల్చర్:

భరించలేని దుర్వాసన

భరించలేని దుర్వాసన

భరించలేని దుర్వాసన

భరించలేని దుర్వాసన

భరించలేని దుర్వాసన