
వైభవంగా షంషేర్ ఉత్సవం
ఉరవకొండ: ప్రసిద్ధిగాంచిన ఉరవకొండలోని హజరత్ బీబీ జైనబ్బీ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అమ్మ వారి షంషేర్ వేడుక శుక్రవారం వైభవంగా జరిగింది. పామిడి బాషు అంగడి నుంచి షంషేర్‌ను శుభ్ర పరిచి రాయదుర్గం బుడేన్ సాహెబ్ ఇంటి నుంచి మేళతాళాలతో దర్గాకు చేర్చారు. అనంతరం శుక్రవారం వేకువజాము 2 గంటలకు గుర్రంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించి, తిరిగి దర్గాకు చేర్చి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు దర్గా కమిటీ అధ్యక్షుడు హోతూరు బాషా, సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటీలు ఆకట్టుకున్నాయి.