
●సర్వజనం.. వేదనాభరితం
వైకల్య ధ్రువీకరణ కోసం
అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వేచి ఉన్న దివ్యాంగులు
దివ్యాంగుల పింఛన్లు ఆగిపోయాయి.. చిన్న చిన్న కారణాలతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వేలల్లో లబ్ధిదారుల పింఛన్లను నిలుపుదల చేసే చర్యలకు కూటమి సర్కార్ తెరదీసింది. ఈ మేరకు నోటీసులు జారీ కావడంతో ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో తెలియక దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. తమ వైకల్యాన్ని ధ్రువీకరించుకునేందుకు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాల కోర్చి బుధవారం సర్వజనాస్పత్రికి పరుగున చేరుకున్నారు. దీంతో సర్వజనాస్పత్రిలో వేదనాభరిత దృశ్యాలు చూపరుల హృదయాలను కదిలించాయి. సీఎం చంద్రబాబు ఏ పని చేసినా దానికో లెక్క... ఆ లెక్కలో పక్కాగా మోసం, కుట్ర దాగి ఉంటుందనేందుకు దివ్యాంగ పింఛన్ల తొలగింపే నిదర్శనం.
– సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం