పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్‌ఐ రాజశేఖర్‌పై వేటు పడింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్‌కు పంపారు.
ఏటీఎం దోపిడీ దొంగ అరెస్ట్
సాక్షి,బళ్లారి: బళ్లారి నగరంలోని కాళమ్మ సర్కిల్ సమీపంలో ఏటీఎంలో ఉన్న డబ్బులను దొంగలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.మంగళవారం తెల్లవారుజామున కాళమ్మ స్ట్రీట్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి సీడీఎంను ఓపెన్ చేస్తున్న సందర్భంలో బ్యాంక్ వద్ద డ్యూటీ చేస్తున్న నింగప్ప పోలీసులకు సమాచారం అందించాడు. బ్రూస్‌పేట్ ఏఎస్‌ఐ మల్లికార్జున హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకోగా దొంగ పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే మరో పోలీస్‌కు సమాచారం అందించడంతో రాత్రి గస్తీ తిరుగుతున్న అనిల్, సిద్దేశ్ ఏటీఎం వద్దకు చేరుకుని దొంగ వెంకటేష్‌ను పట్టుకుని అరెస్ట్ చేశారు. వెంకటేష్ అనంతపురం నగరంలోని సాయినగర్ వాసి అని విచారణలో తేలింది.