నాడు రాద్ధాంతం.. నేడు అదే సిద్ధాంతం
అనంతపురం అర్బన్: సమగ్ర భూ సర్వేకు సంబంధించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుసరించిన మార్గమమే ఉత్తమమని కూటమి ప్రభుత్వ చేపట్టిన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ బాటను అనుసరిస్తూ భూముల రీ–సర్వే చేపట్టింది. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా చేపట్టిన భూముల రీ సర్వేపై విష ప్రచారం సాగించిన టీడీపీ కూటమి నేతల నోళ్లు ఇప్పడు మూతపడ్డాయి. దీనికి తోడు భజన పత్రికల చేతులకు బ్రేక్‌లు పడ్డాయి.
గత ప్రభుత్వంలో సర్వే ఇలా
సర్వే క్రమంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా మండలానికి ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను మొబైల్ మెజిస్ట్రేట్‌గా గత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే పంథాను అనుసరిస్తోంది. జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 31 మండలాల్లో ఉన్న 503 గ్రామాలకు సంబంధించి 25,17,658.52 ఎకరాల రీ సర్వేకు గత ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్‌లై ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) చిత్రాలను తీశారు. 499 గ్రామాలకు సంబంఽధించి ఓఆర్‌ఐలు సిద్ధంగా ఉన్నాయి. అదే క్రమంలో 198 గ్రామాల్లోని 5,88,615.626 ఎకరాల సర్వే సంపూర్ణ స్థాయిలో పూర్తి చేశారు. ఈ విధానాలతో సర్వే ప్రక్రియను గత ప్రభుత్వం సులభతరం చేసింది. దీంతో తాజాగా మిగిలిన 305 గ్రామాల్లో ఎలాంటి అడ్డంకులూ లేకుండా రీ–సర్వేకు అధికారులు సమాయత్తమయ్యారు. ప్రస్తుతం రెండు దశలుగా 62 గ్రామాల్లో సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున మొదటి దశలో 31 గ్రామాలు, రెండో దశలో మరో 31 గ్రామాల్లో సర్వే చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
గతంలో పక్కాగా రీ–సర్వే
గత ప్రభుత్వంలో భూముల రీ–సర్వే ప్రక్రియ పక్కాగా జరిగింది. 503 గ్రామాలకు గానూ 198 గ్రామాల పరిధిలోని 1,83,353 భూ కమతాలకు సంబంధించి 5,88,615.626 ఎకరాలు సర్వే చేసి హద్దులు నిర్ధారిస్తూ రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో అధికారులు గ్రామ సభలను నిర్వహించారు. అయితే 1,83,353 భూ కమతాలకు గానూ 5,421 ఫిర్యాదులు (0.03 శాతం) మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే సర్వే పక్కగా జరిగినట్లుగా స్పష్టమైంది. దీంతో అప్పట్లో రీ సర్వే ప్రక్రియపై విమర్శలు చేసిన నోళ్లు మూతపడ్డాయి. రీ–సర్వేపై విషం చిమ్ముతూ కథనాలు ప్రచురించిన పత్రికలు సైతం మూగబోయాయి.
503
భూముల రీ–సర్వే చేయాల్సిన గ్రామాలు
సర్వే చేయాల్సిన మొత్తం విస్తీర్ణం
రీ–సర్వేపై అప్పట్లో పచ్చ‘బ్యాచ్’ విష ప్రచారం
తాజాగా సర్వేకు అప్పటి విధానాలనే అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం
పైలెట్ ప్రాజెక్టుగా రెండు దశల్లో 62 గ్రామాల్లో సర్వే
నాడు రాద్ధాంతం.. నేడు అదే సిద్ధాంతం
నాడు రాద్ధాంతం.. నేడు అదే సిద్ధాంతం


