‘వెటర్నరీ’ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ అధికారుల సంఘం (వెటర్నరీ ఆఫీసర్స్ అసోసియేషన్) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డిపల్లి శిక్షణా కేంద్రం ఏడీ డాక్టర్ వి.రామచంద్రారెడ్డిని ఎన్నుకోగా, కార్యదర్శిగా పి.మల్లేష్‌గౌడ్ (కొత్తచెరువు వీహెచ్, ఏడీ), కోశాధికారిగా డాక్టర్ జీఎస్ అమర్ (మడకశిర వీహెచ్, ఏడీ), ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ ప్రసన్నబాయి (తలుపుల వీహెచ్, ఏడీ), జాయింట్ సెక్రటరీగా డాక్టర్ ఖదీర్‌బాషా (తాడిపత్రి వీహెచ్, ఏడీ) ఎన్నికయ్యారు. ఎన్నికై న నూతన కార్యవర్గ సభ్యులు రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.


