పోలీసులను పరుగులు పెట్టించిన సెల్ఫీ వీడియో | - | Sakshi
Sakshi News home page

పోలీసులను పరుగులు పెట్టించిన సెల్ఫీ వీడియో

Apr 26 2025 12:20 PM | Updated on Apr 26 2025 12:13 PM

పోలీసులను పరుగులు  పెట్టించిన సెల్ఫీ వీడియో

పోలీసులను పరుగులు పెట్టించిన సెల్ఫీ వీడియో

తాడిపత్రి టౌన్‌: స్థానిక పోలీసులను శుక్రవారం ఓ సెల్ఫీ వీడియో పరుగులు పెట్టించింది. తాడిపత్రిలోని జయనగర్‌ కాలనీకి చెందిన విశ్వనాథ్‌కు వైఎస్సార్‌ జిల్లా వీరపునాయనిపల్లి మండలం అలివేలు ఓబాయపల్లెకి చెందిన హరిణితో వివాహమైంది. 

ఈ నేపథ్యంలో భార్య హరిణి, ఆమె తల్లి గంగమ్మ, అలివేలు ఓబాయపల్లెకి చెందిన గ్రామ పెద్దలు కొంత కాలంగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విశ్వనాథ్‌ శుక్రవారం ఉదయం ఓ సెల్ఫీ వీడియో తీసి కుటుంబసభ్యులకు, సచివాలయ పోలీసులకు పంపాడు. సెల్ఫీ వీడియో చూడగానే హరిణి,తల్లి గంగమ్మను పిలుచుకుని పట్టణ సీఐ సాయి ప్రసాద్‌ను సచివాలయ పోలీసు లత కలసి సమస్య వివరించారు. 

వీడియోను పరిశీలించిన పోలీసులు ఆటో నగర్‌ సమీపంలో చిత్రీకరించినట్లు నిర్ధారించుకుని బృందాలుగా విడిపోయి విశ్వనాథ్‌ కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో చివరకు అతని సెల్‌ఫోన్‌కు కాల్‌ చేయడంతో సమాధానమిచ్చాడు. స్టేషన్‌కు వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

 

Advertisement
 
Advertisement
Advertisement