కళ్యాణదుర్గం రూరల్: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం కళ్యాణదుర్గంలో చేపట్టిన శాంతియుత ర్యాలీ విజయవంతం కావడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ‘స్థానిక’ పోరులో తమ దాష్టీకాలను ప్రజల్లో ఎండగట్టారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించింది. శాంతియుత ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, నాయకులు మాదినేని ఉమా మహేశ్వరనాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి (బ్రహ్మసముద్రం), గోపారం శ్రీనివాసులు (ముదిగల్లు), ఎంఎస్ రాయుడు (శెట్టూరు), ఎర్రంపల్లి కృష్ణ మూర్తి, భీమేష్(కంబదూరు), ఎస్,కే సుదర్శన్‌రెడ్డి, గోళ్ళ సూరి, వడ్డే వెంకటప్ప (కంబదూరు), కళ్యాణదుర్గానికి చెందిన షెక్షావలి, బిక్కి హరి, సుధీర్, దొడగట్ట మురళి, హరినాథ్‌రెడ్డి (శెట్టూరు) తోపాటు మరికొంతమందిపై కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.


