అనంతపురం న్యూ టౌన్: ఇటీవల ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఆధారంగా ఆయా మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఎన్నికల నిమిత్తం జిల్లాలోని 31 మండలాలకు ప్రిసైడింగ్ అధికారులను (పీఓ) నియమించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఎన్నికల ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మండల కో ఆప్షన్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ కో ఆప్షన్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ నియామకాలకు సంబంధించి ఇదివరకే ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు గెజిటెడ్ అధికారులకు అధికారాలిచ్చినట్లు పేర్కొన్నారు.


