● రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు
జిల్లా నుంచి ఏడు ప్రాజెక్టుల ఎంపిక
● విజేతలను అభినందించిన డీఈవో
కశింకోట : జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2026 కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన ఏడు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని తమ వినూత్న విజ్ఞాన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఆహారం, వ్యవసాయం, ఇంధన వనరులు, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై తమ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. నిపుణులైన న్యాయ నిర్ణేతల బృందం ప్రాజెక్టులను పరిశీలించి ప్రతిభ కనబరిచిన ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్ నాగేశ్వరరావు విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా మరింత ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనా నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి చక్కని వేదికగా నిలిచిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు, సమన్వయకర్త ఎస్.బాబూరావు, జిల్లా అకడమిక్ కో–ఆర్డిడనేటర్ బి.ఎ.మూర్తి తదితరుల సమన్వయంతో కార్యక్రమం జరిగింది.
రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్ట్‌లు..
అచ్యుతాపురం మండలం హరిపాలెం హై స్కూల్‌కి చెందిన పి.దివ్యశ్రీ తయారు చేసిన ‘గ్రీన్ గోల్డ్–ఫైనాపిల్ నుంచి ఫ్యూచర్ ఫైబర్’ ప్రాజెక్టు
కశింకోట మండలం తాళ్లపాలెంలోని ఏపీ సాంఘిక సంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని పి.అశ్విని తయారు చేసిన ‘సిట్రస్ టు క్లీనర్’
జె.నాయుడుపాలెంకు చెందిన మరిసా దివ్యశ్రీ రూపొందించిన ‘థర్మో ఎకోగార్డు’
యలమంచిలి మండలం పులపర్తి జెడ్పీహెచ్ స్కూలుకి చెందిన జి.లాస్య తయారు చేసిన ‘స్మార్ట్ వాటర్ క్వాలిటీ కార్డు విత్ క్యూఆర్ కోడ్’
సోమలింగపాలెం జెడ్పీహెచ్ స్కూల్‌కు చెందిన డి.సౌమ్య రూపొందించిన ‘ఎకో ఫ్రెండ్లీ ఎడిబుల్ స్పూన్స్’
పరవాడ జెడ్పీ హైస్కూలుకి చెందిన పి.హర్షిత తయారు చేసిన ‘బయోచార్ యూజింగ్ సిల్వి కల్చర్’
అనకాపల్లి మండలం మామిడిపాలెం జెడ్పీ హైస్కూలుకి చెందిన పి.రూప సుప్రియ తయారు చేసిన ‘బయో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఫ్రం అగ్రికల్చర్ వేస్టు’ ప్రాజెక్టు.


