రాంబిల్లి టీడీపీలో చిచ్చు | - | Sakshi
Sakshi News home page

రాంబిల్లి టీడీపీలో చిచ్చు

Nov 20 2026 12:49 AM | Updated on Nov 20 2026 12:49 AM

రాంబిల్లి : ఎంపీపీ ఎన్నిక సాక్షిగా రాంబిల్లి టీడీపీలో చిచ్చు చెలరేగింది. టీడీపీ బీఫాం పొందిన జడ్‌.చింతువ ఎంపీటీసీ సభ్యుడు ఎరిపిల్లి అప్పలరాజుకు ఆయా పార్టీ నుంచి గెలిచిన ఒక్క సభ్యుడు మద్దతుగా నిలవలేదు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు మాత్రమే అప్పలరాజుకు మద్దతు తెలిపారు. టీడీపీకే చెందిన మురకాడ ఎంపీటీసీ సభ్యురాలు వసంతవాడ లక్ష్మీనాగరత్నంకు బీఫాం దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీపీ బరిలో నిలిచారు. ఆమెకు టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. అలాగే ముగ్గురు బలం వున్న జనసేనకు చెందిన ఒక ఎంపీటీసీ సభ్యురాలు నాగమణి మద్దతు తెలిపారు. దీంతో లక్ష్మీనాగరత్నంను ఎంపీపీగా ఎన్నికల అధికారి లక్ష్మి ప్రకటించారు. దీంతో ఓటమిపాలైన ఎరిపిల్లి అప్పలరాజు మద్దతుదారులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, ఎంపీపీ భర్త దిన్‌బాబులపై ఆరోపణలు గుప్తిస్తూ ఆందోళన చేశారు. సీఐ నర్సింగరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించి ఉద్రిక్త పరిస్ధితులను అదుపులోకి తీసుకువచ్చారు. ఎంపీపీ ఎన్నిక ఫలితంతో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయారు. బీఫాం ఇచ్చిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావుకు భంగపాటు తప్పలేదు. ఎన్నిక తీరును పర్యవేక్షించడానికి వచ్చిన టీడీపీ మండల అధ్యక్షుడు లాలం భరత్‌ బీఫాం పొందిన అప్పలరాజు ఓడిపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు.

ఉత్కంఠ భరితంగా ఎంపీపీ ఎన్నిక

బీఫాం లేకపోయినా లక్ష్మీ నాగరత్నంకే ఓటు

ఓటమి పాలైన అప్పలరాజు మద్దతుదారులు నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement