అనకాపల్లి : 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లైంగిక వేధింపులు, దాడులు, అశ్లీల నేరాల నుంచి రక్షించడానికి పోక్సో చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా పదో అదనపు న్యాయమూర్తి, ఎంఎల్‌ఎస్‌సీ చైర్మన్ వి.నరేష్ అన్నారు. స్థానిక మెయిన్‌రోడ్డు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశనుంచి చట్టాలపై అవగాహన కలిగి ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సివిల్ న్యాయమూర్తి(సీనియర్ డివిజన్) పి.నాగేశ్వరరావు, అడిషనల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) జి.రామకృష్ణ, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి జి.ధర్మారావు, మొదటి అడిషనల్ సివిల్ న్యాయమూర్తి(జూనియర్ డివిజన్) ఎ.రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ సాయి పాల్గొన్నారు.


