భారీ వాహన డ్రైవర్లకు మరమ్మతులపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

భారీ వాహన డ్రైవర్లకు మరమ్మతులపై శిక్షణ

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

అనకాపల్లి : రానున్న రోజుల్లో భారీ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జిల్లా రవాణాశాఖ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు అమృత గ్రీష్మ, కావ్యలు అన్నారు. స్థానిక ప్రజారవాణాశాఖ (ఆర్టీసీ) కార్యాలయం ఆవరణలో ఆర్టీసీ డ్రైవింగ్‌ భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ 16వ బ్యాచ్‌ కార్యక్రమాన్ని గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు. భారీ వాహనాలు డ్రైవింగ్‌ శిక్షణలో ప్రతి డ్రైవర్‌ జాగ్రత్తగా శిక్షణ పొందుతున్న సమయంలో డ్రైవింగ్‌తో పాటు, బస్‌ మరమ్మతు పనులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బస్సులు ఎక్కడైనా చిన్నపాటి సమస్యతో ఆగిపోయినప్పుడు డ్రైవర్లు మరమ్మతు పనులు చేసి తీసుకుని వెళ్లడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. శిక్షణలో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలని కోరారు. డ్రైవర్లు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు యోగా సాధనాలు చేయాలన్నారు. కార్యక్రమంలో డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వి.రమణ, డ్రైవింగ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఎ.వి.బాపునాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement