రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఏర్పాట్లు

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

21, 22 తేదీల్లో అనకాపల్లిలో నిర్వహణ

అనకాపల్లి: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకుని శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని వివేకానంద చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, వైద్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు కాండ్రేగుల విష్ణుమూర్తి కోరారు. స్థానిక జార్జిక్లబ్‌ ఆవరణలో వివేకానంద చారిటబుల్‌ ట్రస్ట్‌, జార్జిక్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఓపెన్‌ మెన్‌ డబుల్స్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో జార్జిక్లబ్‌ ఆవరణలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు 22వ తేదీ సాయంత్రం బహుమతులు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతిగా రూ.12 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.8 వేలు, తృతీయ బహుమతిగా రూ.6 వేలు, చతుర్థ బహుమతిగా రూ.4 వేలు అందించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement