వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనుత్తేజం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనుత్తేజం

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

మునగపాక : ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎపుడు జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారనడానికి ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమన్నారు. మునగపాక ఎంపీపీగా ఎన్నికై న మొల్లేటి శంకర్‌ను గురువారం ఆయనతో పాటు పార్టీ నేతలు ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్‌ తదితరులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమర్‌నాఽథ్‌ మాట్లాడుతూ మాజీ సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలిచారన్నారు. ప్రజలకు సేవలందించే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం కావాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, ఎంపీటీసీలు అప్పికొండ కళ్యాణం,ఆడారి మాధవి,కిలాడి దేముళ్లు,కోనపల్లి రామ్మోహనరావు,కాండ్రేగుల జగన్‌,బొడ్డేడ వీరలక్ష్ని.యల్లపు కుమారితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అలాగే ఉమ్మలాడ వైఎస్సార్‌సీపీ గ్రామశాఖ అధ్యక్షులు మొల్లేటి అచ్చినాయుడు ఆధ్వర్యంలో పలువురు నాయకులు శంకర్‌ను కలిసి సత్కరించారు.కార్యక్రమంలో పార్టీ నేతలు పల్లె అప్పలనాయుడు.కాండ్రేగుల రామప్పారావు,విల్లూరి సత్తిబాబు, మొల్లేటి సత్యనారాయణ,చవల శేఖర్‌, సతివాడ శ్రీనివాసరావు,చదరం దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement