వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతాం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతాం

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

● తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేయలేం ● ఎంపీటీసీలు వీసం నానాజీ, దేవి ● 24గంటలు తిరక్కుండానే సొంత గూటికి

నక్కపల్లి : తల్లిలాంటి వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి ద్రోహం చేయలేమని, ఇదే పార్టీలో కొనసాగుతా మని మాజీ వైస్‌ ఎంపీపీ, పెదబోదిగల్లం సెగ్మెంట్‌నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన వీసం నానాజీ ఆయన సతీమణి, రేబాక ఎంపీటీసీగా గెలిచిన వీసం దేవి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ సోదరుడు అయిన నానాజీ, ఆయన సతీమణి ఇద్దరూ బుధవారం హోంమంత్రి అనిత సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు గడవకముందే ఇద్దరూ మనసు మార్చుకుని తిరిగి సొంత గూటికి చేరారు. శుక్ర వారం వీరిద్దరికి వీసం రామకృష్ణ పార్టీ కార్యాల యం వద్ద కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా వీసం నానాజీ మాట్లాడుతూ తొందరపాటు నిర్ణయంతో టీడీపీలో చేరానన్నారు. తాము ఈ స్థాయికి రావడానికి కారణమైన వైఎస్సార్‌సీపీని, అధికార పార్టీ నాయకులను, ప్రలోభాలకు తలొగ్గకుండా మాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సీతంపాలెం, పెద దొడ్డిగల్లు,పెదబోదిగల్లం, రేబాక గ్రామాల ఓటర్లను దృష్టిలో పెట్టుకుని తిరిగి సొంత గూటికి రావడం జరిగిందన్నారు. బుధ వారం మేమిద్దరం తీసుకున్న నిర్ణయం వల్ల మండలంలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తీవ్ర మనోవేదన చెందడం మాకు బాధ కలిగించిందన్నారు. జరిగిన ఘటనకు క్షమాపణ కోరుతున్నామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఘటనను పీడకలగా మర్చిపోవాలన్నారు. తమ కుటుంబం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతుందని ప్రతిపక్షంలో కొనసాగుతూనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. మమ్మల్ని ఆదరిస్తున్న అభిమానులకు పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు. సమావేశంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు గొర్ల గోవిందు, సీనియర్‌ నాయకులు పొడగట్ల పాపారావు, వెలగా ఈశ్వరరావు, కొనల్నాటి దుర్గాప్రసాద్‌, తళ్ల భార్గవ్‌, గంట తిరుపతిరావు, పొడగట్ల వెంకటేష్‌, వీసం శ్రీను, వీసంరాజు ఎంపిటీసీలు తుమ్మా కల్పన, కొవిరి రమణ, పిక్కికాశీ, బంగార్రాజు, కోడినాగేశ్వరరావు, మైలప్లిల్లి జాన్‌ అల్లాడ కొండ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement