రెండో విడత ‘పంచాయతీ’కి నగారా | - | Sakshi
Sakshi News home page

రెండో విడత ‘పంచాయతీ’కి నగారా

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

● నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికారులు ● రేపటి నుంచి నామినేషన్లు

నక్కపల్లి: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయింది. పాయకరావుపేట , యలమంచిలి నియోజకవర్గాల్లో ముందు ప్రకటించిన విదంగా డిసెంబరు 2న కాకుండా నవంబరు 29న సర్పంచ్‌, వార్డుసభ్యులు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మండల పరిషత్‌ కార్యాలయ నోటీసు బోర్డులో నోటిఫికేషన్‌ కాపీలను అధికారులు అతికించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో 213 సర్పంచ్‌ పదవులకు 2072 వార్డు సభ్యులకు నవంబరు 29న ఎన్నికలు జరగనున్నాయి. 2092 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోను యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 4,17,399 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించి 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22వ తేదీన నామినేషన్ల తిరస్కరణపై అిప్పీలు చేసుకోవచ్చు. 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది. 29న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌, తర్వాత లెక్కింపు ఉంటుంది. అదే రోజు సాయంత్రానికి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. పోలింగ్‌ రోజు ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి రీపోలింగ్‌ అవసరమయితే 30వ తేదీన రీపోలింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మొత్తం 109 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నక్కపల్లి మండలంలో మొత్తం 33 పంచాయతీలకు గాను 8 చోట్ల నామినేషన్ల స్వీకరించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement