సదస్సు ప్రాంగణంలో అడుగుపెడితే చాలు.. ఎటుచూసినా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సందడే కనిపించింది. పారిశ్రామికవేత్తలు, సీఈఓలు క్యూ కడతారని భావిస్తే.. ఆన్‌లైన్‌లో చీరలు విక్రయించేవారు, వస్త్ర దుకాణాల్లో ఆఫర్ల గురించి రీల్స్ చేసేవారు, హోటళ్లలో ఆహార పదార్థాలను పరిచయం చేసే ఫుడ్ వ్లాగర్లే ఎక్కువగా దర్శనమిచ్చారు. వీళ్లంతా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన బిజినెస్ టైకూన్లు కాదు. చేతిలో సెల్ఫీ స్టిక్‌లు, మైకులు పట్టుకుని హాళ్లన్నీ కలియతిరుగుతూ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు వచ్చిన సోషల్ మీడియా ప్రచారకర్తలు. ఈ హడావుడి చూస్తే.. ఇది రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చే బిజినెస్ సమ్మిట్టా? లేక లైక్‌లు, వ్యూస్ కోసం నిర్వహించిన యూ ట్యూబర్ల సమ్మిట్టా? అన్న సందేహం కలగకమానదు.
సదస్సులో ఇన్‌ఫ్లుయెన్సర్ల హడావుడి


