యలమంచిలి రూరల్: పట్టణంలోని కోర్టుపేటకు చెందిన వివాహిత ఉప్పులూరి సునీత(36) అదృశ్యమైనట్టు ఆమె భర్త ఉప్పులూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సునీత తిరిగి రాకపోవడంతో భర్త యలమంచిలి పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్కాంప్లెక్స్, పెంజెరువు ప్రాంతం సహా పలుచోట్ల గాలించాడు. పుట్టింటి వద్ద కూడా ఆరా తీశాడు.అయినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం యలమంచిలి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలిస్తే యలమంచిలి పట్టణ పోలీసులకు నేరుగా గానీ 9440796103 నంబరుకు కాల్ చేసి గానీ తెలియజేయాలని ఎస్ఐ కోరారు.


