వెల్లివిరిసిన ఆధ్యాత్మికత | - | Sakshi
Sakshi News home page

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

కె.కోటపాడు : చౌడువాడ గ్రామంలో అయ్యప్పస్వామి మహ సన్నిదాన పూజా కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన అయ్యప్ప మాలాధారులైన సిద్దనాతి రాము, చోరీగల పైడారావు, దాడి మోహన్‌ సత్యనారాయణలు వైభవంగా నిర్వహించారు. గ్రామంలో గల శివాలయంను ఆనుకొని ఉన్న సామాజిక భవణంను ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి నమూనా ఆలయంగా తయారీని చేశారు. వీటితో పాటు ప్రత్యేకంగా మహ సన్నిదాన పూజలో పాల్గోన్న అయ్యప్ప మాలాధారులైన భక్తులు పూజా అనంతరం పడిమెట్లపై నుంచి స్వామి దర్శనం కలిగించేందుకు ప్రత్యేకంగా పడిమెట్లను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా అయ్యప్ప, వినాయకుని, కుమారస్వామి, లక్ష్మీదేవి అమ్మవార్లకు పూజా, హోమాది కార్యక్రమాలతో పాటు అఖండ హరతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పూజా కార్యక్రమాల అనంతరం అయ్యప్పస్వామిపై ఆలపించిన భక్తి గీతాలతో పాటు శరణుఘోష, పేడతుల్లి కార్యక్రమాలను జరిపారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలధారులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం అయ్యప్ప మాలధారులకు ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టిన పడిమెట్లపై నుంచి మూల విరాట్‌ దర్శనం కల్పించారు. మాలధారులు, భక్తులు ఆనంద పరవశితులయ్యారు. ఈ కార్యక్రమానికి చౌడువాడ శివాలయం పీఠానికి చెందిన అయ్యప్ప మాలధారులు, భక్తులు పాల్గోని సహయ సహకారాలను అందించారు. గురుస్వాములు జిక్కి స్వామి, మూర్తి స్వామి, దాడి అప్పారావు స్వామి, అచ్చింనాయుడు స్వామి, రమణస్వామి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement