రికార్డులు తనిఖీ చేస్తున్న డీఈవో నాగేశ్వరరావు
మాకవరపాలెం: పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో నాగేశ్వరరావు సూచించారు. స్థానిక ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరును పరిశీలించిన అనంతరం తరగతుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన మెనూ అమలు, సిలబస్ పూర్తిపై ఆరా తీశారు. ప్రధానంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం చిత్ర పటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటాంటి ప్రముఖల జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.


