తాగునీటి కలుషితంపై అధికారుల అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కలుషితంపై అధికారుల అప్రమత్తం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

కొట్నాబిల్లిలో నీటి ట్యాంకులు, బోరుబావులు, మోటార్ల తనిఖీ

పరీక్షల కోసం రాజమండ్రి ల్యాబ్‌కు నీటి నమూనాలు

నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు

రావికమతం: మండలంలోని కొట్నాబిల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కలుషితంపై అధికారులు అప్రమత్తమయ్యారు. కలుషిత నీరు తాగడం వల్లే ముగ్గురు మృతి చెందారని గ్రామస్తులు మండల పరిషత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ భగవంతరావు, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి కొట్నాబిల్లి, కె.గదపపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులు, బోరుబావులు, మోటార్లను పరిశీలించారు. ట్యాంకుల్లోని నీటిని పరీక్షించగా కలుషితం కాలేదని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ భగవంతరావు తెలిపారు. అయితే గ్రామస్తులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నట్లు చెబుతున్న నేపథ్యంలో తాగునీటి వినియోగం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయా? అన్న కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం నీటి నమూనాలను సేకరించి రాజమండ్రి ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్‌ నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇటీవల మృతి చెందిన వారిలో వృద్ధులతో పాటు కొంతకాలంగా డయాలసిస్‌ చేయించుకుంటున్న వ్యక్తి కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కె.గదపపాలెంలో రక్త నమూనాల సేకరణ

కె.గదపపాలెంలో ఇటీవల ముగ్గురు మరణించడంతో కొత్తకోట పీహెచ్‌సీ వైద్యులు బుధవారం గ్రామంలో పర్యటించారు. కిడ్నీ బాధితులను గుర్తించేందుకు గ్రామస్తుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. కొత్తగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల కేసులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించేందుకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ సురేఖ, ఎల్‌సీడీసీ స్వప్న, డీఎ్‌ల్‌టీవో వినోద్‌కుమార్‌, డీఎంవో వరహాలుదొర, డీఎంవో ధృవ వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement