పాయకరావుపేట: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్టు చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్‌ఐ జె.పురుషోత్తం తెలిపారు. నర్సీపట్నం శివపురానికి చెందిన గొర్లి నానాజీ అలియాస్ నాయుడు గతంలో పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో 2018 జూలైలో నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో, 2025 ఫిబ్రవరిలో పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయినా నిందితుడు తన ప్రవర్తన మార్చుకోకుండా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దీంతో చట్టం ప్రకారం నిందితుడిని అరెస్టు చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించామన్నారు.


