● అమర వీరులకు నివాళులర్పించిన సీసీఎఫ్
నివాళులర్పిస్తున్న సీసీఎఫ్ రాజు, డీఎఫ్‌వో శామ్యూల్, రేంజర్ వెంకట్రావు
నర్సీపట్నం: డివిజనల్ అటవీ అధికారి కార్యాలయంలో అటవీ అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. విశాఖపట్నం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(సీసీఎఫ్)ఐ.కె.వి.రాజు, డీఎఫ్‌వో ఎం.శామ్యూల్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ మాట్లాడుతూ విధుల్లో ప్రాణాలు కోల్పోయి అమరులైన అటవీ అధికారులు, ఉద్యోగుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. వన సంపదను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్న అటవీ సిబ్బంది త్యాగాలు మరువలేమన్నారు. కార్యక్రమంలో రేంజర్ వెంకట్రావు, సెక్షన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


