ప్రకృతి పరవశించి తన కాన్వాస్‌పై బంగారు వర్ణాలను అద్దిన మలిసంధ్య వేళ.. కొండల మాటున భానుడి రుధిర కాంతులు నిశ్చల మేహాద్రి జలాలపై పసిడి బాటను పరిచాయి. అలల తాకిడి లేని ప్రశాంత నీటిపై ఒక్కడై సాగిపోతున్న మత్స్యకారుడు, నిత్య జీవన ప్రయాణంలో ముందుకు సాగే మనిషి అంతరంగానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. మేఘపు తెరల చాటునుంచి తొంగిచూస్తున్న భానుడి వెలుగురేఖలు నీటిపై ప్రతిబింబిస్తూ భూమ్యాకాశాలను ఏకం చేస్తున్న అనుభూతినిస్తున్నాయి. రొదలేని నిశ్శబ్దం, ప్రకృతి లాలన కలగలిసిన ఈ రమణీయ దృశ్యం నిత్య జీవితపు అలసటను ఇట్టే మాయం చేసి మనసుకు అనిర్వచనీయమైన ప్రశాంతతను పంచుతూ.. ‘సాక్షి’కెమెరాకు చిక్కింది. – సాక్షి ఫొటోగ్రాఫర్


