చౌడువాడ–1 సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ హ్యాట్రిక్‌ | - | Sakshi
Sakshi News home page

చౌడువాడ–1 సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ హ్యాట్రిక్‌

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

● మూడు పర్యాయాలు తల్లీకుమారులదే గెలుపు

కె.కోటపాడు: మండలంలో చౌడువాడ–1 సెగ్మెంట్‌ నుంచి వైఎస్సార్‌సీపీ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత నుంచి ఇక్కడ ఎంపీటీసీ స్థానానికి నిర్వహిస్తున్న ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తున్నారు. 2014, 2021, 2026 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. ఈ ఘనత తల్లీకుమారులదే కావడం విశేషం. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల శివాజీరాజు ఆశీస్సులతో 2014, 2021 ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేసిన ఏటుకూరి రాజేష్‌ తమ సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై 2014లో 78 ఓట్లు, 2021లో 628 ఓట్లు తేడాతో విజయాలను అందుకున్నారు. ప్రస్తుత పరిషత్‌ ఎన్నికల్లో ఈ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించగా, అతను ఈసారి తన తల్లి జయలక్ష్మిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. ఆమె తన సమీప జనసేన పార్టీ అభ్యర్థిపై 102 ఓట్ల తేడాతో గెలుపొందారు. వరుసగా చౌడువాడ–1 స్థానం నుంచి రెండు సార్లు ఎంపీటీసీగా ఏటుకూరి రాజేష్‌, తాజాగా ఏటుకూరి జయలక్ష్మి గెలిచారు.

ఏటుకూరి జయలక్ష్మి

ఏటుకూరి రాజేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement