పిచ్చి కుక్క దాడిలో 19 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క దాడిలో 19 మందికి గాయాలు

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

సబ్బవరం: మండలంలో పిచ్చికుక్క స్వైరవిహరం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం నాటికి 19 మందిని గాయపరిచింది. పలు గ్రామాల్లో సంచరిస్తున్న ఈ కుక్కను పట్టుకునేందుకు ఎవరూ సాహసించలేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అసకపల్లి సమీపంలోని గణపతినగర్‌కు చెందిన ఏడేళ్ల బాలికపై దాడి చేసి, గాయపరిచింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆమెను సబ్బవరం పీహెచ్‌సీకి తరలించారు. ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌ఎన్‌ చక్రవర్తి బాలికకు యాంటీ రేబిస్‌ బ్యాక్సిన్‌ వేసి, చికిత్స అందించారు. మండల ప్రజలను అప్రమత్తం చేశారు. కుక్కకాటు బాధితులు గాయాన్ని ప్రవహించే నీటితో సబ్బు పెట్టి కనీసం 15 నిమషాల పాటు శుభ్రంగా కడగాలన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలన్నారు. కుక్క కాటును నిర్లక్ష్యం చేయవద్దని, చిన్నారులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కుక్క కాటుకు గురైన గణపతినగర్‌కు చెందిన చిన్నారి, కాలు పై భాగంలో కుక్క కాటు గాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement