పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Nov 3 2026 1:09 AM | Updated on Nov 3 2026 1:09 AM

● జిల్లా పరిషత్‌ సీఈవో సత్యనారాయణ

తుమ్మపాల : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అఫీసర్‌ సత్యనారాయణ తెలిపారు. జెడ్పీ సీఈవో కార్యాలయం నుంచి సోమవారం వీడియో ద్వారా ఆయన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ సెంటర్‌, కౌంటింగ్‌ సెంటర్‌ వివరాలను తెలియజేశారు. అనకాపల్లి, బుచ్చెయ్యపేట, కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం మండలాలకు సంబంధించి ఏఎంఏఎల్‌ కాలేజ్‌ , కొత్తూరు విలేజ్‌, అనకాపల్లిలోని రిసెప్షన్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ సెంటర్‌, కౌంటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

చోడవరం మండలానికి సంబంధించి గవర్నమెంట్‌ హైస్కూల్‌, చోడవరం, దేవరాపల్లి, కె కోటపాడు మండలాలకు సంబంధించి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులం (బాయ్స్‌), తెనుగుపూడి దేవరాపల్లి మండలంలోనూ, నక్కపల్లి మండలానికి సంబంధించి గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ నక్కపల్లిలోనూ, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం మండలాలకు సంబంధించి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, నక్కపల్లిలోనూ, మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట మండలాలకు సంబంధించి డాన్‌ బాస్కో స్కూల్‌, పెద్ద బొడ్డేపల్లిలోనూ, కోటవురట్ల, గొలుగొండ, నాతవరం, రావికమతం మండలాలకు సంబంధించి గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌ నర్సీపట్నంలో, వి. మాడుగుల, చీడికాడ మండలాలకు సెంటాన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ , వి.మాడుగులలో, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు ఇండోర్‌ స్టేడియం యలమంచిలిలో, యలమంచిలి మండలానికి ఎస్‌జీఏ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల యలమంచిలిలో రిసెప్షన్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ సెంటర్‌, కౌంటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

425 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 427 సెగ్మెంట్స్‌ ఉండగా, వాటిలో 2 ఏకగ్రీయమయ్యాయని, మిగిలిన 425 స్థానాలకు ఈ నెల 5న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ జరగనుందని జిల్లా పరిషత్‌ సీఈఓ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ కోసం మొత్తం 10,345 మంది సిబ్బందిని నియమించామని, పోలింగ్‌ కేంద్రాల్లో ఒక పీవో, ఏపీవో, ఓపీవోలు ఉంటారని తెలిపారు. ఈ నెల 5న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఈ నెల 7న ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని, పోలింగ్‌ కేంద్రాలలో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాలెట్‌ పేపర్లను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు.

అలాగే జిల్లాలో జెడ్పీటీీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 24 సెగ్మెంట్స్‌ను ప్రతి మండలానికి ఒకటి చొప్పున కేటాయించడం జరిగిందని, వాటికి మొత్తం 80 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా పరిషత్‌ సీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,530 పోలింగ్‌ స్టేషన్లలో ఈ నెల 5న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ నెల 7న ఉదయం 8 గంటల నుండి 7 కేంద్రాలలో పోలింగ్‌ జరుగుతుందన్నారు. 24 మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాల కోసం 2,255 మంది సిబ్బందిని మొబిలెజ్‌ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement