పోస్టుమార్టంకు రూ.10వేలు! | - | Sakshi
Sakshi News home page

పోస్టుమార్టంకు రూ.10వేలు!

Nov 3 2026 1:09 AM | Updated on Nov 3 2026 1:09 AM

● ఎన్టీఆర్‌ ఆస్పత్రికి లంచాల జబ్బు ● డాక్టర్లు, పోలీసులు తీరుపై మార్చురీ వద్ద బాధితుల ధర్నా

అనకాపల్లి : ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టంకు లంచాల వసూళ్లు తారస్థాయికి చేరుకున్నాయని, అక్కడే విధులు నిర్వహిస్తున్న వైద్యుడు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను మీడియేటర్లను చేసి లంచాలు వసూలు చేస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు వై.ఎన్‌.భద్రం ఆరోపించారు. స్థానిక ఆస్పత్రి మార్చురీ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశింకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్లంకిల్లి శివ అనే యువకుడు యాక్సిడెంట్‌లో మృతి చెందగా అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తీసుకుని రావడం జరిగిందన్నారు. విధులు నిర్వహిస్తున్న వైద్యుడు పోస్టుమార్టం చేసేందుకు రూ.10వేలు ఇస్తేనే పని జరుగుతుందని పోలీసుల ద్వారా మృతుడి బంధువులను డిమాండ్‌ చేయడంతో వారు అంత ఖర్చు చేయలేమనగా రూ.7500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారని మృతుని బంధువులు తెలిపారన్నారు. ధర్నాలో ఎల్లంకల వెంకట్‌, అప్పారావు, మనోజ్‌, గంగరాజు, భాస్కర్‌రావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement