టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన వారికి
పార్టీ కండువా వేస్తున్న అనురాధ
వేముల వేంకటేశ్వరరావును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చిక్కాల రామారావు
నక్కపల్లి : మండలంలో చినదొడ్డిగల్లుకు చెందిన జనసేన నాయకుడు, మాజీ సైనికోద్యోగి పంపన బోయిన శ్రీను సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. శ్రీనుకు పార్టీ రాష్ట్ర కార్యదర్సి వీసం రామకృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీను స్థానిక ఎన్నికల్లో జనసేన నుంచి ఎంపీటీసీగా పోటీ చేయాలని భావించారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే పార్టీ బీఫారం ఇవ్వలేదు. దీంతో బలమైన సామాజిక వర్గానికి చెందిన శ్రీను జనసేనకు రాజీనామా చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు మోయడానికే తప్ప పదవులు అనుభవించే అదృష్టానికి నోచుకోలేదన్నారు. కార్యకర్తలన్నా, ప్రజా సంక్షేమమన్నా, చిత్తశుద్ధితో పనిచేసే వైఎస్సార్‌సీపీలో చేరాలని భావించి తన అనుచరులు 50 మందితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరడం జరిగిందన్నారు. చినదొడ్డిగల్లు నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ఎంపీటీసీలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనసేనకు డిపాజిట్ దక్కకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తోట సత్తిబాబు, లక్ష్మణరావు, జిల్లా యూత్ విభాగం కార్యదర్శి వెలగా రమేష్, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
పాయకరావుపేట : మండలంలో గల అరట్లకోట గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు వేముల వేంకటేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు పార్టీ కండువా వేసివేముల వేంకటేశ్వరరావును సాదరంగా ఆహ్వానించారు. వేముల వేంకటేశ్వరరావు బీజేపీలో పార్టీ మండల అధ్యక్షుడుగాను, పలు పదవులను చేశారు. వైఎస్సార్‌సీపీలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు తాను ఆకర్షితుడనై పార్టీలో చేరడం జరిగిందని వేముల వేంకటేశ్వరరావు అన్నారు.
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన
20 కుటుంబాలు
చీడికాడ: మండలంలోని కోనాం శివారు గుడివాడ గిరిజన గ్రామంలో టీడీపీని వీడి 20 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ సాదరంగా ఆహ్వానించారు. మండలంలోని కోనాం శివారు గ్రామాల్లో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామం గుడివాడకు చెందిన టీడీపీ నేత సలుగు దేముడు, మరో 20 కుటుంబాల వారు అనురాధ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సలుగు పెద సత్యనారాయణ, నాయకుడు సలుగు భీమునాయుడు తదితరులు పాల్గొన్నారు.
గుల్లేపల్లిలో టీడీపీని వీడి వైస్సార్‌సీపీలో చేరిక
కె.కోటపాడు: కూటమి వైఫల్యాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ తెలిపారు. మండలంలోని గుల్లేపల్లిలో టీడీపీని వీడి కడుపుకుట్ల మహలక్ష్మినాయుడు, వియ్యపు నాగమణిల, తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఈర్లె అనురాధ పార్టీ కండువాను వేసి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తున్నా మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నగదు ఇవ్వలేదన్నారు. ఏదయినా చెప్పారంటే.. చేసే మనస్తత్వం ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. చెప్పింది చేయలేని మనస్తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ గుల్లేపల్లి ఎంపీటీసీ అభ్యర్థి బండారు మంగమ్మను జెడ్పీటీసీ అభ్యర్థి రెడ్డి జగన్‌మోహన్‌లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారు దేముళ్లు, బండారు శ్రీరామ్మూర్తి, గేదెల ప్రసాద్, కశిరెడ్డి రాంబాబు, కర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్.రాయవరం : టీడీపీ అప్రజాసామిక పరిపాలన, అబద్దపు హామీలతో విసుగుచెంది మండల కేంద్రం సీనియర్ కార్యకర్త ఎస్.రాయవరం ఇంద్ర న్యూకాలనీ గుదిబండి రాము వైఎస్సార్‌సీపీలో చేరారు. గ్రామశాఖ అధ్యక్షుడు కర్రి కోటేశ్వరరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఎంపీటీసీ ఎన్నిక ప్రచారం సోమవారం రాత్రి పార్టీలో చేరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు లక్కోజు ఆదిమూర్తి, గట్టెం పర్వతాలు, దుబాజి జోగారావు, ఎస్సీ సెల్ అద్యక్షులు బంగారి లక్ష్మణరావు, కొమ్ము జగదీష్,కర్రి గాంధీ, నవీన్, లక్ష్మీనారాయణ,పోతురాజు,ఈతకొట్టు నాగు,కశింకోట సత్యవతి,రామ్‌దాస్,స్వామి తదితరులు ఉన్నారు.


