సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

మున్సిపోల్‌కు..
నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

యలమంచిలి రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల పండగకు సమయం ఆసన్నమైంది. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ సమయంలోగా పోలింగ్‌ కేంద్రాల్లోకి వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయక్రిష్ణన్‌ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. సామగ్రి పంపిణీని జిల్లా కలెక్టర్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ పరిశీలించారు. ఓటర్లకు బ్యాలెట్‌ పేపర్లు ఇవ్వడం, పీవో డైరీ నింపడం, పోలింగ్‌ పూర్తయ్యాక సీల్‌ వేయడం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. శనివారం సాయంత్రం యలమంచిలి గురప్ప కల్యాణ మండలంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి సామగ్రి తీసుకుని సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బస్సులు, ఇతర వాహనాల్లో చేరుకున్నారు.అడ్డరోడ్డు ఆర్డీవో కె.వి.రామలక్ష్మి, యలమంచిలి తహసీల్దార్‌ వరహాలు, యలమంచిలి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు పంపిణీ కేంద్రం వద్ద ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. కాగా పోలింగ్‌ తర్వాత బందోబస్తు నడుమ బ్యాలెట్‌బాక్స్‌లను గురప్ప కల్యాణ మండపంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించనుండగా, ఈ నెల 3వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

యలమంచిలిలో 36,523 మంది ఓటర్లు..

80 మంది అభ్యర్థులు

యలమంచిలి మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 36,526 మంది ఓటర్లున్నారు. అందులో 17,450 మంది పురుషులు, 19,068 మంది మహిళలు, 8 మంది ట్రాన్స్‌ జెండర్లు ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరంతా పోటీలో ఉన్న ముగ్గురు చైర్‌పర్సన్‌, 77మంది వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 63 పోలింగ్‌ కేంద్రాలు (పీఎస్‌)లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవో, 4 ఇతర సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఇప్పటికే ర్యాంప్‌, టాయిలెట్స్‌, విద్యుత్‌ సరఫరా, తాగునీరు వంటి వసతులు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినా, కొన్నిచోట్ల మాత్రమే వాటిని ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లు, జోనల్‌ అధికారులు పోలింగ్‌ ప్రక్రియను నిశితంగా పరిశీలించనున్నారు. పోలింగ్‌ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రతి ఓటరూ హక్కును వినియోగించుకోవాలి

డాబాగార్డెన్స్‌: ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌, అదనపు ఎన్నికల అధికారి కేతన్‌గార్గ్‌ పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేయాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఎన్నికల నిర్వహణపై సమీక్షించిన ఆయన, శనివారం పది జోన్లలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement