అనకాపల్లి టౌన్ : జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఉన్న ఆరు వార్డులలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక్కడి రావుగోపాలరావు కళాకేంద్రంలో పోలింగ్ సిబ్బది, 20 మంది రూట్ ఆఫీసర్లతో జీవీఎంసీ కమిషనర్ కె.చక్రవర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బ్యాక్స్‌లు, ఇంక్ తదితర ఎన్నికల సామగ్రిని 89 పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అందజేశారు. ఈ ఎన్నికల సందర్భంగా 13 అత్యంత సమస్మాత్మక కేంద్రాలు, 23 సమస్యాత్మక కేంద్రాల వద్ద సీపీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు సులువుగా ఓటు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు, ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్‌ను జాగ్రత్తగా బ్యాలెట్ బాక్స్‌లో వేసేందుకు తగిన సూచనలను అందివ్వాలన్నారు. ఎక్కడా ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఎన్నికలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు.
● జీవీఎంసీ జోన్ పరిధిలో 89 పోలింగ్ కేంద్రాలు ● 13 అత్యంత, 23 సమస్యాత్మక కేంద్రాలు ● ఆరు వార్డుల్లో 79,950 మంది ఓటర్లు
Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM
● జీవీఎంసీ జోన్ పరిధిలో 89 పోలింగ్ కేంద్రాలు ● 13 అత్యంత, 23 సమస్యాత్మక కేంద్రాలు ● ఆరు వార్డుల్లో 79,950 మంది ఓటర్లు
Advertisement


