● ఎన్నికల అబ్జర్వర్ గోపాలకృష్ణ
ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ
నర్సీపట్నం : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డాన్ బాస్కో కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పోలింగ్ సిబ్బంది రాకపోకలకు సంబంధించిన మార్గాలు, వాహనాల పార్కింగ్, ప్రవేశం నిష్క్రమణ మార్గాలు తదితర విషయాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో వి.వి.రమణ, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జంపా సురేంద్రను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వర్తించాలని వారికి సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పీవో, ఏపీవోలు మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.


