● 10 మందికి బంగారు పతకాలు
ప్రతిభ చూపిన విద్యార్థులతో పాటిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి,ఉపాధ్యాయులు
మునగపాక : మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కళా పోటీల్లో తమ ప్రతిభ చూపించారు. ఆలిండియా స్వచ్ఛ భారత్ ఆర్ట్స్ కాంపిటేటివ్ పోటీల్లో పాటిపల్లి మోడల్ స్కూల్ నుంచి 77 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 10మంది బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు శనివారం సంబంధిత విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. చేతిరాత, చిత్రలేఖనం, రంగులు నింపడం, హస్త కళలు,చిత్ర వర్ణన తదితర పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించడం సంతోషకరమన్నారు. ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


