ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావివ్వొద్దు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావివ్వొద్దు : కలెక్టర్‌

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

ఎన్నికల సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌

యలమంచిలి రూరల్‌: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయ క్రిష్ణన్‌ తెలిపారు. యలమంచిలి గురప్ప కల్యాణ మండపంలో పోలింగ్‌ సామగ్రి పంపిణీ, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించారు. పోలింగ్‌ విధులు నిర్వర్తించడానికి వచ్చిన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో ఆమె వెంట జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రవీంద్ర ధామ, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, అడ్డరోడ్డు ఆర్డీవో కె.వి.రామలక్ష్మి, యలమంచిలి తహసీల్దార్‌ కె.,వరహాలు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement