టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

మాడుగుల : మాడుగుల మండలం శంకరం పంచాయతీ కొత్తవలస గ్రామం నుంచి టీడీపీ, జనసేన పార్టీల నుంచి సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వీరు స్వచ్ఛందంగా దేవరాపల్లి మండలం తారువ వెళ్లి మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాల నాయుడు సమక్షంలో శుక్రవారం వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆయన ఆహ్వానించారు. రానున్న కాలంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతుందని, మీకు అండగా ఉంటానని, వారికి ముత్యాలనాయుడు భరోసా కల్పించారు. వైఎస్సార్‌సీపీలోకి చేరిన వారిలో టీడీపీ నుంచి జనపరెడ్డి ఈశ్వరరావు, జనపరెడ్డి సన్యాసిరావు, చిన్ని కొండలరావు, చిన్ని కృష్ణ, అలాగే జనసేన నుండి చిన్ని రమేష్‌, చిన్ని గణేష్‌, జనపరెడ్డి దిబ్బం నాయుడు, చీమల రవి, జనపరెడ్డి కొండలరావుతో పాటు మరో 41 కుటుంబాల వారు మాజీ సర్పంచ్‌ సొలం రమేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిన్ని అప్పారావు, చిన్ని రమణ, జనపరెడ్డి అర్జునరావు,కడుకుల కొండలరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement