బూడికి ధర్మాన సోదరులు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

బూడికి ధర్మాన సోదరులు పరామర్శ

Oct 20 2026 4:55 AM | Updated on Oct 20 2026 4:55 AM

దేవరాపల్లి: వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును సోమవారం మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు పరామర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు మాతృమూర్తి అమ్మనమ్మ ఈ నెల 14న కన్నుమూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దేవరాపల్లి మండలం తారువలోని బూడి నివాసానికి చేరుకొని అమ్మనమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ధర్మాన సోదరులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్‌–1 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ సహా కుటుంబ సభ్యులకు వారితోపాటు ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, నాయకులు మామిడి శ్రీకాంత్‌, అంబటి శ్రీను తదితర నాయకులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement