చోడవరం: పట్టణంలో టీడీపీ, జనసేనల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కోటవీధి, శివాలయం వీధి, బోళ్లవీధికి చెందిన వేదుల రాజు ఆధ్వర్యంలో వార్డు మాజీ సభ్యురాలు కరణం లక్ష్మి, బొద్దాన చందు, బొద్దాన సతీష్‌తో పాటు 40 మంది కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి గుడివాడ అమర్‌నాథ్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ సీనియర్ నేత నూకప్పారావు చేరిక
అనకాపల్లి: కశింకోట మండలం మోసయ్యపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గోకివాడ నూకప్పారావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి సోమవారం అనకాపల్లి రింగ్‌రోడ్డులోని పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ కశింకోట మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, మాజీ జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు పాల్గొన్నారు.
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు
సత్యనారాయణపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కుండల శ్రీనుతో పాటు మరో పది మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. మలసాల భరత్‌కుమార్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, మాజీ ఎంపీపీ గొర్లి సూరిబాబు పాల్గొన్నారు.


