తుని: తుని–పెంటకోట రోడ్డులో ఓ కారు ప్రమాదానికి గురై పాన్‌షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ కథనం ప్రకారం.. తుని రామకృష్ణ కాలనీకి చెందిన నలుగురు యువకులు సోమవారం కారులో వెళ్తుండగా వీరవరపుపేట సమీపంలో ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొన్నారు. దీంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న పాన్‌షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పాన్‌షాపునకు చెందిన రవికుమార్, పార్వతితో పాటు రామభద్రాపురానికి చెందిన కోమరి గాయపడ్డారు. బైక్‌పై తుని నుంచి వీరవరపుపేట వైపు వెళ్తున్న నూకరాజు, దుర్గాప్రసాద్, బి.ప్రసాద్ కూడా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


