నక్కపల్లి: మండలంలో ఉద్దండపురంలో వైఎస్సార్సీపీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలో చేరాయన్నది తప్పుడు ప్రచారమని పలువురు నాయకులు పేర్కొన్నారు. పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, తాజా మాజీ సర్పంచ్ పొడగట్ల వెంకటేష్, మాజీ ఎంపీటీసీ బచ్చలరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు బచ్చల దొరబాబు, సీనియర్ నాయకులు పొడగట్ల సూరిబాబు తదితరులు శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ హోం మంత్రి అనిత సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జికి వైఎస్సార్సీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. అతని అనుచరులంతా టీడీపీ సానుభూతి పరులేనన్నారు. బీజేపీలో చేరిన విశాఖ డైయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ వర్గీయులన్నారు. మంత్రి మెప్పు కోసం ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేవలం కోమర్తి బాబూరావు మాత్రమే వెళ్లాడన్నారు. అతను కూడా కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నాడన్నారు. స్థానిక ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.


