ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

● సమన్వయంతో ఏర్పాట్లు సిద్ధం చేయాలి ● అధికారులతో కలెక్టర్‌ సమీక్ష ● సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు

తుమ్మపాల : మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో శనివారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు సమన్వయంతో స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించి, అవసరమైన మరమ్మతులను వెంటనే పూర్తి చేయించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు రిజర్వేషన్ల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు వ్యక్తిగతంగా పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి, అక్కడి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో రహదారులపై గుంతలు, ఇరుకై న రహదారుల వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా రహదారులకు మరమ్మతులు చేయించి, ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, ఆర్డీవోలు, జిల్లా పరిషత్‌ సీఈవో, డిప్యూటీ సీఈవో, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

పట్టణానికి చేరిన బ్యాలెట్‌ బాక్సులు

అనకాపల్లి టౌన్‌ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లు ఊపదుకున్నాయి. జీవీఎంసీ పరిదిలో ఆరు వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డులలో మెత్తం 79, 950 ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు 196 బ్యాలెట్‌ బ్యాక్స్‌లు, ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ఇంకులు, పెన్నులు తదితర సామగ్రి అంతా పట్టణానికి చేరాయి. వీటిని రావు గోపాలరావు కళాకేంద్రంలో భద్రపరిచారు. ఈ ఎన్నికల నిమిత్తం 89 పోలింగ్‌ స్టేషన్లు, 20 రూట్లను ఏర్పాటు చేసినట్టు జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తి తెలిపారు. పీఓ, ఏపిఓలకు ఈ నెల 14,15 తేదీలలో ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు, అలాగే పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement