రోడ్డు వేయండి.. కష్టాలు తప్పించండి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు వేయండి.. కష్టాలు తప్పించండి

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

రోలుగుంట : తమ గ్రామాల్లో రోడ్డు కోసం అర్ల పంచాయతీ కొండ శిఖరాగ్రాన ఉన్న పీత్రుగెడ్డ, పెదగరువు, లోసింగి తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం మూడు కిలోమీటర్లు ర్యాలీ, అర్ధనగ్నంగా మోకాళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సారధ్యం వహించిన సీపీఎం జిల్లా ప్రతినిధి కె.గోవింద వీరి సమస్యలపై మాట్లాడారు. అర్ల పంచాయతీ శివారు కొండ శిఖరాగ్రాన ఉన్న పాత లోసింగి. కొత్తలోసింగి, పెదగరువు పివిటిజి కొందుజాతికి చెందిన 250 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. పల్లె పండగ 1.0 మొదటి అడవితల్లి బాట ప్రోగ్రాంలో భాగంగా రూ. 2,50 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఎర్త్‌ వర్కు చేసి పనులు అపేశారు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ‘ఒక నెల నాలుగు విజిట్లు’ చోడవరం నియోజకవర్గంలో భాగంగా ప్రజలతో కలసి ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.రాజుకు వినతి పత్రం అందజేయడం జరిగింది. రోడ్డు పనులు మొదలు పెడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నేటికి నాలుగు మాసాలు అవుతుంది. 3.0 పల్లె పండగలో అభివృద్ధి చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు తప్ప రోడ్డు పనులు చేపట్టడం లేదు. ఈ రోడ్డు పనులు 2020 లోనే శ్రమదానం, ఇక్కడ కుటుంబాల వారు ఒక్కో ఇంటికి రూ.2 వేలు చొప్పున సొంత నిధులు సమకూర్చుకుని ఫార్మేషన్‌ చేసుకున్నారు. మండల పరిషత్‌ నుంచి ఇచ్చిన రూ.10 లక్షలతో కాంట్రాక్టర్‌ రోడ్డు వేశారు. వర్షానికి కొట్టుకుపోయింది, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు కూడా కాంట్రాక్టరు తూతూమంత్రంగా రోడ్డు వేసి రూ.8 లక్షలు నిధులు మంజూరు చేసుకున్నారు. రోడ్డు దుస్థితిపై అధికారుల దృష్టికి పలు దఫాలు విన్నవించుకున్నా ఫలితం లేదని కిలో నర సయ్య, పాంగి నాగేషు, కొండ తాంబులి, సత్తిబాబు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement