రాంబిల్లి : గొరపూడి శివారు అప్పన్నపాలెంలో శనివారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. నష్ట పరిహారం ఇవ్వకుండా తమ భూముల్లో ఫెన్సింగ్ పనులు చేపట్టడం, అక్రమ కేసులు బనాయించడంపై రైతులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా పోలీసులు చేరుకొని టెంట్‌ను తొలగించారు. అనుమతులు లేవంటూ పోలీసులు టెంట్‌ను తొలగించారని రైతు నాయకులు గొర్లె నర్సింగరావు, గొర్లె సత్యనారాయణ, లాలం తాతబాబు, నెక్కల నర్సింగరావు తెలిపారు. దీంతో రైతులు పక్కనే ఉన్న ప్రదేశంలో కూర్చొని ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ 50 లక్షలు చెల్లించాకే భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. కోర్టుల్లో కేసులు వేశామని, కోర్టులను గౌరవించి తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు కోరారు. తమకు నష్టపరిహారం చెల్లించే వరకు ఫెన్సింగ్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాము ఇంత ఇబ్బందుల్లో ఉంటే అఽధికారంలో ఉన్న కూటమి పెద్దలు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు.


