మాడుగుల రూరల్ : షటిల్ బాడ్మింటన్ పోటీల్లో జి. అగ్రహారం జిల్లా పరిషత్ హైస్కూలు పదో తరగతి విద్యార్థిని పి. పునీత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కాగా ఈ విద్యార్థిని అనకాపల్లి జార్జి క్లబ్‌లో ఇటీవల జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా షటిల్ బాడ్మింటన్ పోటీల్లో అండర్ 17 విభాగంలో విజేతగా నిలిచింది. ఈమె ఈ నెల 14, 15, 16, తేదీల్లో కడపలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని పాఠశాల హెచ్‌ఎం ఉమాశంకర్ శనివారం తెలిపారు. పునీతను పాఠశాల పీఈటీ ఎల్.ఎ.నాయుడు, పాఠశాల ఉపాధ్యాయులతో పాటు గ్రామంలో గల మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు అభినందించారు.


