పట్టుబడిన గంజాయి నిందితుడితో టౌన్ సీఐ గఫూర్, సిబ్బంది
నర్సీపట్నం : గంజాయి తరలిస్తున్న వ్యక్తిని నర్సీపట్నం టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎస్.కె.గఫూర్ అందించిన వివరాలివి. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ రమేష్, సిబ్బంది ఆర్టీసీ ఇన్‌గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా బ్యాగుతో వెళ్తున్న తమిళనాడుకు చెందిన జయశీలన్(43)ను అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్ తనిఖీ చేయగా 6 కిలోల గంజాయి లభించింది. ఒడిశాలో ఒక వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. తమిళనాడుకి తీసుకువెళ్తున్నట్టు నిందితులు అంగీకరించారు. నిందితుడు నుంచి గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


