ఎస్.రాయవరం : రాష్ట్ర స్థాయి పుడ్‌బాల్ పోటీలకు 10 మంది విద్యార్థులు ఎంపికై నట్టు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 విభాగంలో చినగుమ్ములూరు ఉన్నత పాఠశాల నుంచి 8 మంది, ఎస్.రాయవరం బాలికల ఉన్నత పాఠశాల నంచి ఇరువురు విద్యార్థులు ఎంపికై నట్టు ప్రధానోపాధ్యాయులు శకుంతల, వీసం ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెలక్షన్స్‌లో ఈ విద్యార్థులు ఎంపికై నట్టు చెప్పారు. చిగుమ్ములూరు నుంచి త్రిపుర, దీపిక, భవ్యశ్రీ, పి.హాసిని, భవిష్య, భవానీ, తనీష, భార్గవ్ కాగా, ఎస్.రాయవరం నుంచి ఎండి, హాలీమున్నీసా, టి.హారిక ఎంపికై నట్టు చెప్పారు. ఈ మేరకు వారిని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానిక గ్రామస్తులు అభినందించారు.


