జనసేనకు రాంబిల్లి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా | - | Sakshi
Sakshi News home page

జనసేనకు రాంబిల్లి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా

Oct 10 2026 12:52 AM | Updated on Oct 10 2026 12:52 AM

రాంబిల్లి: జనసేన పార్టీ రాంబిల్లి మండల ఉపా ధ్యక్షుడు ఉరిటి నానాజీ తన పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. అప్పారాయుడుపాలెం పంచాయతీ శివారు భోగాపురం గ్రామానికి చెందిన నానాజీ జనసేన యలమంచిలి కోర్‌ కమిటీ సభ్యుడిగా, రాంబిల్లి పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పంచదార్ల అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై కలెక్టర్‌కు తాను ఫిర్యాదు చేయడం, నో మైనింగ్‌ జోన్‌గా ప్రక టించడం వంటి ఘటనలతో తనపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడిన వారిని స్థానిక ఎమ్మెల్యే పక్కన పెడుతున్నారని ఆరోపించారు. జనసేన కోసం పనిచేసి తీరా అధికారంలోకి వచ్చాక అవమానాల బారిన పడటం తనను కలచివేయడంతో పార్టీకి రాజీనామా చేసినట్టు నానాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement