తొండంగి: బెండపూడి హైవేపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. తొండండి ఎస్ఐ జగన్మోహన్రావు కథనం ప్రకారం.. నాతవరం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి నందిక గోవిందుకు సంతోష్‌కుమార్, బుల్లిరాజు(20) కుమారులు ఉన్నారు. సంతోష్‌కుమార్ డ్రైవర్‌గా, బుల్లిరాజు తాపీమేస్త్రిగా పనిచేస్తున్నారు. డ్రిల్లింగ్ మెషీన్ కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఉదయం నాతవరంలో అన్నయ్య బైక్ తీసుకుని బుల్లిరాజు రాజమహేంద్రవరం బయలుదేరాడు. ఈ నేపథ్యంలో బెండపూడి హైవే వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో బుల్లిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు.


