కె.కోటపాడు: మండలంలోని ఎ.కోడూరు పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14 జిల్లా స్థాయి రగ్బీ పోటీలు ఈ నెల 7న భీమునిపట్నంలో జరిగాయి. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు అమల అజేయన్, గుంపాన గంగరాజు మంచి ప్రతిభ చూపారు. అన్నమయ్య జిల్లాలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనున్నారు. ఈ నెల 8న గోవాడలో అండర్–17 రగ్బీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన వి.సాధ్విక్, టి.వైష్ణవి ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరిద్దరూ పాల్గొనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్లు కె. చిట్టిప్రసాద్, ఆర్.తమ్మునాయుడు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో ఎంఈవో ఎ.శేఖర్, పీడీలు, ఉపాధ్యాయులు బొడ్డు శివప్రసాద్, సూర్రెడ్డి బాబూరావు, పీఎంసీ కమిటీ చైర్మన్ డి.రమేష్ అభినందించారు.


